హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం..
ABN , Publish Date - Sep 19 , 2026 | 07:43 PM
హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ ప్రాంతాల్లో వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ ప్రాంతాల్లో వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అలాగే నాగోల్, ఉప్పల్, రామంతపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. శంషాబాద్, చంద్రాయణగుట్ట, బాలాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షపు జల్లులు నమోదయ్యాయి. మరోవైపు ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షంతో నగర వాతావరణం చల్లబడింది.
ఒక్కసారిగా వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Read Latest AP News And Telugu News