Share News

ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:18 AM

‘‘ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వైఖరి మార్చుకోవాలి. లేదంటే హైదరాబాద్‌లో మాత్రం మాములగా ఉండదు. ఎన్నికల కమిషన్‌ గానీ, హైదరాబాద్‌ గానీ తగలబడిపోతయ్‌’’ అని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు.

ఎన్నికల కమిషన్‌, హైదరాబాద్‌ తగలబడిపోతయ్‌
Danam Nagender

  • ఓట్ల తొలగింపు అంశంలో ఈసీ వైఖరి మార్చుకోవాలి: దానం నాగేందర్‌

బంజారాహిల్స్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వైఖరి మార్చుకోవాలి. లేదంటే హైదరాబాద్‌లో మాత్రం మాములగా ఉండదు. ఎన్నికల కమిషన్‌ గానీ, హైదరాబాద్‌ గానీ తగలబడిపోతయ్‌’’ అని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు. హిమాయత్‌నగర్‌లో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైన ఆయన మీడిమాతో మాట్లాడారు. కొందరు అధికారులు బీజేపీతో కుమ్మక్కై పెద్దఎత్తున అర్హులైన ఓటర్ల పేర్లను గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కాకముందే 20వేల మంది ఓట్లను అక్రమంగా తొలగించారని, ప్రస్తుతం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయో పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


రెండు దశాబ్దాలుగా స్థానికంగానే ఉన్న ఓటర్లను సైతం అకారణంగా జాబితా నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల తొలగింపు కుట్ర వెనుక ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందని, స్థానిక ఏఈఆర్వో, ఏఎంసీ అధికారుల ప్రమేయం లేకుండానే బంచ్‌ల కొద్దీ ఓట్లు ఆన్‌లైన్‌ ద్వారా డిలీట్‌ అయిపోతున్నాయన్నారు. ఓటు చోరీపై రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని ఎన్నికల కమిషన్‌ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. తొలగించిన 20 వేల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...
రియల్‌ వెర్రి..!

తీర్పు వచ్చే వరకూ.. ఉప ఎన్నిక వద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:18 AM