ఏఐతో ట్రాఫిక్ రద్దీకి చెక్!
ABN , Publish Date - Feb 27 , 2026 | 09:24 AM
ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
జ్యూరిక్ సాంకేతికతపై సైబరాబాద్ సీపీ దృష్టి
త్వరలో అమలుకు చర్యలు
హైదరాబాద్ సిటీ: ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్(IT Corridor) వైపు అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. సోమవారం నుంచి శుక్రవారం ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యంగా మారుతున్నాయి.
ముందుగానే రద్దీ అంచనా
సైబరాబాద్‌కు కొత్త పోలీస్ కమిషనర్‌గా వచ్చిన ఎం.రమేష్ ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యలకు దారి తీస్తున్న అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా ఫ్రీ లెప్ట్ విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ‘ట్రాన్స్‌కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నియంత్రించి వాహనాల రాకపోకలను సుగమం చేయవచ్చని గుర్తించారు. ఈ టెక్నాలజీపై క్షేత్ర స్థాయిలోనూ అధ్యయనం చేపట్టి, సమర్థవంతంగా అమలుకు చర్యలు తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!
మూడో డిస్కమ్ ఏర్పాటులో మరో కీలక అడుగు
Read Latest Telangana News and National News