Share News

సైబర్ బ్యూరో భారీ ఆపరేషన్.. వంద మందికి పైగా ఏజెంట్ల అరెస్ట్

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:00 PM

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. మొత్తం వంద మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది.

సైబర్ బ్యూరో భారీ ఆపరేషన్.. వంద మందికి పైగా ఏజెంట్ల అరెస్ట్
Cyber bureau operation

హైదరాబాద్, అక్టోబర్ 6: దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చి, కేవైసీ పత్రాలు అందజేస్తున్న వంద మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేసింది. వీరికి దేశవ్యాప్తంగా పలు సైబర్ నేరాలతో సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు భారీగా స్వాధీనం చేసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. మొత్తం వంద మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. దాదాపు రెండు వారాల పాటు ఈ సోదాలు జరిగాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను ఈరోజు (మంగళవారం) ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించి, విచారణ జరపనున్నారు.


ఈ వార్తలూ చదవండి

క్యూర్ ప్రాంతంలో ప్రకటనలకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

హైదరాబాద్ కేబీఆర్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated Date - Oct 06 , 2026 | 08:14 PM