Share News

సీఎంను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:13 AM

మార్చి నెలలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు
Congress MLC candidates

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మార్చి నెలలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమను అభ్యర్థులుగా ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.


ఇద్దరు అభ్యర్థులకు అభినందనలు తెలిపిన సీఎం.. ఓటర్ల నమోదు, ప్రచారంపై తగిన సూచనలు చేశారు. అభ్యర్థులతో పాటుగా సీఎంను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
నిమ్స్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు

తల్లికి వైద్యం అందడం లేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:13 AM