గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:46 PM
ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్: ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అవసరమైతే వారికి తగిన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ ప్రాంతంలోని తెలుగు అసోసియేషన్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారు.. భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుంది. ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?