Share News

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 18 , 2026 | 09:42 PM

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములపై 2 రోజుల్లో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు.


జిల్లాల వారీగా 22-ఏ భూములపై సమగ్ర పరిశీలన చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తప్పులు లేని తుది జాబితా రూపొందించాలని ఆధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వమని అన్నారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.


భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని ప్రజలకు సూచించారు. పుకార్లు, కట్టుకథలను నమ్మొద్దని ప్రజలకు స్పష్టం చేశారు. అనంతరం 22-ఏ భూముల జాబితాపై జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయి: బీజేపీ ఎమ్మెల్యే

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

For More TG News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 10:02 PM