Share News

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:46 PM

హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

హైదరాబాద్, ఆగస్టు18: నగరంలోని ఫూల్‌బాగ్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ప్రభావతి.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రభావతిపై కేసు నమోదు చేశారు.


ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. తమకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఏసీబీ అధికారులు సూచించారు. మరో వైపు అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ సిబ్బందిలో ఎటువంటి మార్పు రావడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తరచూ ఎప్పుడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఫూల్‌బాగ్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్

వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్

For More TG News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 07:55 PM