Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయి: బీజేపీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:51 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూడా కూటమి కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయి: బీజేపీ ఎమ్మెల్యే
Vishnu Kumar Raju

విశాఖపట్నం, ఆగస్టు18: స్థానిక సంస్థల ఎన్నికల్లో 2024 ఫలితాలే రిపీట్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూడా కూటమి కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండ్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.


శాసనమండలికి వైసీపీ ఎమ్మెల్సీలు వస్తున్నారు.. కానీ శాసనసభకు డుమ్మా కొడుతున్నారని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఎవరో మిస్ గైడ్ చేస్తున్నారని అన్నారు. వైసీపీని నాశనం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే .. అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.


అసెంబ్లీకి వస్తే తనకు మాట్లాడే సమయం ఇవ్వరని వైఎస్ జగన్ ఊహజనితమైన భావనలో ఉన్నారన్నారు. అసెంబ్లీలో తమ సమయం కూడా.. మీకే ఇస్తామని జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. అయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదని అసహనం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అరాచకాలు ఉండవని ఆయన కుండబద్దలు కొట్టారు. .. దయచేసి అసెంబ్లీకి రావాలని జగన్‌కు స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు.. ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు సందేహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

జయహో బీసీ.. స్థానిక సంస్థల బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 08:55 PM