Share News

మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ అండ

ABN , Publish Date - Sep 17 , 2026 | 08:24 PM

తెలంగాణలో రజాకార్ల నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఉప్పల మల్సూర్ కుటుంబం నేడు నిలువ నీడ కోసం ఎదురు చూస్తోందన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది.

మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ అండ
Ex MLA uppala malsur and Revanth reddy

హైదరాబాద్, సెప్టెంబర్17: తెలంగాణలో రజాకార్ల నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఉప్పల మల్సూర్ కుటుంబం నేడు నిలువ నీడ కోసం ఎదురు చూస్తోందన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలో మల్సూర్ ఇద్దరు కోడళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను సీఎం రేవంత్ గురువారం ఆదేశించారు.


కోడళ్లు ఉప్పల పుష్పలత, ఉప్పల యశోద పేర్లపై రెండు ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ వెంటన మంజూరు చేశారు. ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మల్సూర్ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు.. 1952 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా మల్సూర్ విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన ప్రజల గొంతుకగా నిలిచారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా ఉప్పల మల్సూర్ జీవితాంతం ప్రజల కోసం పనిచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్

ఎన్నికల్లో ఉమ్మడి అజెండాతో వెళ్లనున్న కూటమి పార్టీలు: మంత్రి సత్యకుమార్

For More TG News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 08:35 PM