Share News

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నెట్‌వర్క్‌కు చైనా లింకులు

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:56 AM

ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న భారీ ఆర్ధిక లావాదేవీల గుట్టును బయట పెట్టేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ)రంగంలో దిగింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నెట్‌వర్క్‌కు చైనా లింకులు

  • రూ.లక్ష కోట్ల లావాదేవీలు.. కోట్లలో జీఎస్టీ ఎగవేత,

  • హైదరాబాద్‌, విజయవాడల్లో డీజీజీఐ సోదాలు

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముసుగులో సాగుతున్న భారీ ఆర్ధిక లావాదేవీల గుట్టును బయట పెట్టేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ)రంగంలో దిగింది. హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న 4 గేమింగ్‌ యాప్‌లకు సంబంధించి హైదరాబాద్‌, విజయవాడల్లో సోదాలు నిర్వహించాయి. ఆపరేటర్లు, వారికి ఆర్థిక లావాదేవీల్లో సహకరిస్తున్న ఫైనాన్షియర్ల స్థావరాలపై ఇటీవల దాడులు చేశాయి. హైదరాబాద్‌కు చెందిన కొన్ని సంస్థలు చైనా ఆపరేటర్ల సాయంతో సూపర్‌ విన్నర్‌, బిగ్‌ రమ్మీ విన్నర్‌, బిగ్‌ లక్కీ విన్నర్‌, రమ్మీ రూలర్‌ పేరిట ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు నిర్వహించినట్టు కనుగొన్నారు.


ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రూ.లక్ష కోట్ల లావాదేవీలు నిర్వహించారని, పేమెంట్‌ అగ్రిగేటర్లు డమ్మీ మర్చంట్ల పేరిట సెటిల్‌మెంట్‌ ఖాతాలు నిర్వహించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహరంలో చైనా సంస్థల పాత్ర, వేలకోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేత, క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు నిధుల తరలింపునకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు వివరించారు. ఇక, విజయవాడకు చెందిన గాలి కిరణ్‌ కుమార్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారని ఆయన పాత్రపైన, ఫస్ట్‌ ఫైనాన్స్‌ సోసైటీ పాత్రపైనా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:56 AM