మాంజా తగిలి బాలిక మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:55 AM
హైదరాబాద్ కూకట్‌పల్లిలో చైనా మాాంజా తగిలి నిష్విక ఆదిత్య అనే బాలిక మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్, జనవరి 27: కూకట్‌పల్లిలో చైనా మాంజా తగిలి బాలిక మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ.. కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగురవేశారనేది గుర్తించడం కష్టమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాది చైనా మాంజా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది రెండోదని గుర్తు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రేమ సాగర్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈయన కూకట్‌పల్లి ప్రాంతంలోని గోకుల్ ప్లాట్స్‌లో భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నారు. నిజాంపేటలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. గత సోమవారం(జనవరి 26) సెలవు కావడంతో.. తన ఇద్దరు కుమార్తెలను బైక్‌పై తీసుకుని నిజాంపేటకు వెళ్తున్నారాయన. వివేకానందనగర్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో చైనా మాంజా ఆయన కుమార్తె నిష్విక ఆదిత్య మెడకు చుట్టుకుని కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది.
వెంటనే ఆ అమ్మాయిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక అప్పుటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ప్రేమ సాగర్ కుటుంబం తీవ్ర దు:ఖ సాగరంలో ముగినిగిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ
యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
For More TG News And Telugu News