పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:06 AM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది.
న్యూఢిల్లీ, జనవరి 27: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఈ అఖిల పక్ష సమావేశాన్ని సమన్వయ పరచనున్నారు.
ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ అఖిల పక్ష భేటీలో ఆమోదించాల్సిన బిల్లులు, శాసనాలు, అజెండాలపై చర్చించనున్నారు. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని సంస్థలకు సెలవు ఉంటుంది. అలాంటిది.. ఆ రోజు బడ్జెట్‌ను విత్త మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది పార్లమెంట్ చరిత్రలో అరుదైన ఘటన అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
For More National News And Telugu News