ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: పార్టీ శ్రేణులకు ఎంపీ చామల పిలుపు
ABN , Publish Date - Aug 07 , 2026 | 02:14 PM
సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని బీఆర్ఎస్ నేతలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 07: సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని బీఆర్ఎస్ నేతలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రచారంపై ప్రతి కాంగ్రెస్ నేతకు బాధ్యత ఉందని అన్నారు. జిల్లా, మండల స్థాయిలో స్పోక్స్ పర్సన్లను నియమిస్తామని తెలిపారు. మండల అధ్యక్షులు వారానికి ఓ సారి ప్రెస్ మీట్ పెట్టాలని వారిని ఆదేశించారు.
పోలవరం - బనకచర్ల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడానికి సీఎం రేవంత్‌తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషే కారణమని ఎంపీ చామల పేర్కొన్నారు. తెలంగాణకు 200 టీఎంసీల నీటి విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, స్కిల్ డెవలప్‌మెంట్ పెంపుపై సీఎం రేవంత్ దృష్టిపెడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే టీఎస్‌పీఎస్‌సీ, టెన్త్ పేపర్లు లీకు అయ్యాయని గుర్తు చేశారు.
తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా గంటల్లోనే తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ పీసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్‌గా తనను నియమించినందుకు ఏఐసీసీ అగ్రనేతలు, సీఎం రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ ప్రెసిడెంట్‌కు ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో టీపీసీసీ మీడియా, పబ్లిసిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన నిందితులపై కఠిన చర్యలు: సీఎం ఆదేశం
ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్.. పట్టించేసిన వాట్సాప్ చాట్..
For More TG News And Telugu News