ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్.. పట్టించేసిన వాట్సాప్ చాట్..
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:06 PM
ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త ఆమె వాట్సాప్ చాట్‌లను చెక్ చేయగా మర్డర్ ప్లాన్ బట్టబయలైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త ఆమె వాట్సాప్ చాట్‌లను చెక్ చేయగా మర్డర్ ప్లాన్ బట్టబయలైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జల్లాలోని మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతితో 2016లో పెళ్లైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేశ్వరరావు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లాలోని ఏదులాపురంలో స్థిరపడ్డాడు.
అతడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. 27వ తేదీ మధ్యాహ్నం రాజేశ్వరరావు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని గమనించాడు. ఆమె ప్రవర్తనపై అతడికి అనుమానం వచ్చింది. 28వ తేదీన చిలుకోడులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన అన్నను పంచాయితీకి తీసుకురావడానికి తాళ్లసంకేస గ్రామానికి వెళుతుండగా.. భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తి అతడిని ఫాలో అయ్యాడు. రాజేశ్వరరావుకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు.
రాజేశ్వరరావు ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఫోన్ చేక్ చేశాడు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు చదివి షాక్ అయ్యాడు. భార్య తనను చంపించడానికి ప్రియుడు పురిమెట్ల సైదులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ చాట్‌ల ద్వారా బయటపడింది. తన భర్తను ఇంట్లో చంపవద్దని, బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించమని సైదులుపై రాజేశ్వరరావు భార్య ఒత్తిడి తెచ్చింది. రాజేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. ఆగస్టు 1వ తేదీన భార్యపై ఆమె ప్రియుడిపై డోర్నకల్లు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును ఖమ్మం గ్రామీణ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఇవి కూడా చదవండి
‘చేయూత’కు కసరత్తు.. కొత్త పింఛన్లకు మార్గదర్శకాలు జారీ
చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు