క్యూనెట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు.. 20 మంది నిందితుల గుర్తింపు
ABN , Publish Date - Mar 23 , 2026 | 09:07 AM
క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులకు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్, మార్చి 23: క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులకు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. క్యూనెట్ కార్యాలయాలపై సీసీఎస్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలోని క్యూనెట్ కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో మొత్తం ఆరు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మూడు రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో సాదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో 20 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ మోసాలపై తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. సీసీఎస్‌లో ఇప్పటికే క్యూనెట్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో రూ. వందల కోట్లు క్యూనెట్ వసూలు చేసినట్లు ఈ తనిఖీల్లో సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంతోపాటు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సైతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
క్యూనెట్ ఏజెంట్లుగా ఐటీ ఉద్యోగులు
ఇటీవల హైదరాబాద్‌లోని మధురానగర్, బంజారాహిల్స్, మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లలో క్యూ నెట్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిని సీసీఎస్‌కు పోలీసులు బదిలీ చేశారు. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగడంతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న క్యూనెట్( Q NET) బాగోతం బహిర్గతమైంది. ఐటీ ఉద్యోగులను ఈ క్యూనెట్ ప్రతినిధులు టార్గెట్ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి.. తద్వారా క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టేలా నిందితులు తమ వంతు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కాఫీ షాపుల్లో ఐటి ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆకర్షించే ప్లాన్ అంటూ క్యూనెట్ కేటుగాళ్లు ఐటీ ఉద్యోగులను బురిడి కొట్టించారు. దాంతో పలువురు ఐటీ ఉద్యోగులు క్యూనెట్ ఏజెంట్లుగా మారినట్లు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు
మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు
For More TG News And Telugu News