అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:44 AM
అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్‌బాబా నగర్‌లోని ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. బెడ్ రూమ్‌లోని అల్మరాను ధ్వంసం చేసిన దొంగలు.. అందులోని రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను చోరీ చేశారు.
హైదరాబాద్, మార్చి 23: అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్‌బాబా నగర్‌లోని ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు.. బెడ్ రూమ్‌లోని అల్మరాను ధ్వంసం చేసి అందులోని రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను చోరీ చేశారు. బంధువుల వద్దకు వెళ్లి.. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయి. లోపల చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్ధారించుకున్న ఫిరోజ్.. పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ గంట వ్యవధిలోనే జరిగిందని బాధితుడు ఫిరోజ్ పేర్కొన్నాడు. దీంతో తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి యజమాని ఫిరోజ్ కదిలికలు పసిగట్టే ఈ చోరీకి స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ఫిరోజ్ ఇంటి పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు
For More TG News And Telugu News