Share News

వ్యాధి కారకాలపై ముందస్తు దాడి

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:44 AM

సూక్ష్మక్రిములతో సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి సాధారణంగా అనుసరించే పద్ధతి ఆ క్రిములను పూర్తిగా నాశనం చేయడం. యాంటీ మైక్రోబియల్‌ ఔషధాలు ఈ విధంగానే పనిచేస్తుంటాయి. అయితే, ఈ విధానం దీర్ఘకాలంలో నిలకడైన పరిష్కారం కాదని ఇటీవలి కాలంలో పరిశోధకులు గుర్తిస్తున్నారు.

వ్యాధి కారకాలపై ముందస్తు దాడి
CCMB Hyderabad

  • ఇన్ఫెక్షన్‌ కలిగించక ముందే వైద్య చికిత్స

  • శిలీంధ్రాలపై సీసీఎంబీ పరిశోధనలు

  • క్రిమి రూపాంతరీకరణను అడ్డుకునే

  • ప్రక్రియను గుర్తించిన శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మక్రిములతో సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి సాధారణంగా అనుసరించే పద్ధతి ఆ క్రిములను పూర్తిగా నాశనం చేయడం. యాంటీ మైక్రోబియల్‌ ఔషధాలు ఈ విధంగానే పనిచేస్తుంటాయి. అయితే, ఈ విధానం దీర్ఘకాలంలో నిలకడైన పరిష్కారం కాదని ఇటీవలి కాలంలో పరిశోధకులు గుర్తిస్తున్నారు. యాంటీబయాటిక్‌ ఔషధాలను తట్టుకునేలా సూక్ష్మజీవులు రూపాంతరం చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే వ్యాధికారకాన్నే నియంత్రిస్తే అనే ఆలోచనతో సీసీఎంబీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. శిలీంధ్ర వ్యాధుల సంక్రమణలను నియంత్రించేందుకు వీరు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మన చర్మంపై సహజంగా నివసించే కాండిడా ఆల్బికాన్స్‌ అనే శిలీంధ్రంపై పరిశోధనలు నిర్వహించారు.


కాండిడా ఆల్బికాన్స్‌ మనిషి రక్తంలోకి, శరీరంలోకి ప్రవేశించినప్పుడు తీవ్రమైన వ్యాధి సంక్రమణలకు కారణమవుతుంది. ఈ శిలీంధ్రం గుండ్రని కణాల రూపం నుంచి పొడవైన తంతువుల రూపంలోకి మారుతుంది. దీనివల్లే ఇది మనిషి రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకోగలుగుతుందని డాక్టర్‌ శ్రీరామ్‌ వరహన్‌ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. శిలీంధ్రానికి శక్తినందించే గ్లైకోలిసిస్‌ ప్రక్రియను ప్రభావితం చేయటం ద్వారా.. శిలీంధ్రం తంతువుల రూపంలోకి మారకుండా నిరోధించవచ్చని కనుగొన్నారు. ముఖ్యంగా, రెండు సమ్మేళనాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫెక్టివ్‌ అణువులుగా పనిచేయగలవు. అంటే సూక్ష్మక్రిమిని పూర్తిగా నాశనం చేయకుండా, వ్యాధిని కలిగించే దాని లక్షణాలను నియంత్రించగలవు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు మెరుగైన ఫలితాలను సాధించారు. ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని, అందుబాటులో ఉన్న యాంటీ ఫంగల్‌ చికిత్సలను మరింత సమర్థవంతంగా ఇది మలిచే అవకాశం ఉందని శ్రీరామ్‌ వరహన్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:44 AM