Share News

హైదరాబాద్‌లో ‘బిల్ట్రస్ట్‌’ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:15 AM

జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బిజినెస్‌ టూ బిజినెస్‌ (బీ2బీ) క్యాష్‌ జనరేషన్‌ ప్లాట్‌ఫాం ‘బిల్ట్రస్ట్‌’ కూడా చేరింది.

హైదరాబాద్‌లో ‘బిల్ట్రస్ట్‌’ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌
Duddilla Sridhar Babu

  • 450 కోట్ల పెట్టుబడి.. కొత్తగా వెయ్యిమందికి ఉద్యోగాలు

  • లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ బిజినెస్‌ టూ బిజినెస్‌ (బీ2బీ) క్యాష్‌ జనరేషన్‌ ప్లాట్‌ఫాం ‘బిల్ట్రస్ట్‌’ కూడా చేరింది. మాదాపూర్‌ రహేజా మైండ్‌స్పే్‌సలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల అంచనా పెట్టుబడితో అభివృద్థి చేసిన ‘బిల్ట్రస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆనతికాలంలోనే హైదరాబాద్‌ జీసీసీలకు హబ్‌గా మారిందన్నారు.


గతేడాది 75కు పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ప్రారంభమయ్యాయని ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌లో ఏఐ-ఫస్ట్‌ జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ‘బిల్ట్ర్‌స్ట’కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్లకు పైగా కొనుగోలుదారులకు సేవలు అందిస్తోందన్నారు. ఇక్కడ దశలవారీగా కొత్తగా వెయ్యిమంది హై స్కిల్డ్‌ వర్క్‌ ఫోర్స్‌కు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ, కాంగ్రెస్‌లకు ‘ఖైరతాబాద్‌’ తలనొప్పి!

మరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొన్న ఆటో.. నలుగురి మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:15 AM