Share News

బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:47 AM

‘సారీ మమ్మీ, డాడీ.. బీటెక్‌ చదవడం నా వల్ల కావట్లేదు, నాకు 11 బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి.’ అని వాట్సాప్‌ నోట్‌లో పేర్కొన్న ఓ విద్యార్థి.. హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

  • హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంప్‌సలో ఘటన

హైదరాబాద్‌ సిటీ/హైదర్‌నగర్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘సారీ మమ్మీ, డాడీ.. బీటెక్‌ చదవడం నా వల్ల కావట్లేదు, నాకు 11 బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి.’ అని వాట్సాప్‌ నోట్‌లో పేర్కొన్న ఓ విద్యార్థి.. హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ క్యాంప్‌సలో ఆదివారం జరిగిం ది. ఖమ్మానికి చెందిన చిలివేరు రాజ్‌ విక్రమ్‌బాబు (19) జేఎన్‌టీయూలో బీటెక్‌ (ఐడీపీ) రెండో సంవత్సరం చదువుతూ.. వర్సిటీలోని గౌతమి బాయ్స్‌ హాస్టల్లో ఉంటున్నాడు.


సోమవారం నుంచి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్‌ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు విక్రమ్‌బాబు తన సోదరికి ఫోన్‌ చేసి.. ఓ అమ్మాయి తనతో మాట్లాడటం మానేసిందని, తనకు బీటెక్‌ చదవడం ఇష్టం లేదని, జీవితంలో ఏదీ అనుకున్నట్లుగా జరగడం లేదని అన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, గతంలో ప్రేమ వ్యవహారంలో ఓ అమ్మాయి తరఫువాళ్లు విక్రమ్‌ను బెదిరించారని, ఈ క్రమంలో తమ కుమారుడిపై దాడి చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విక్రమ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 04:47 AM