గ్రామ గ్రామాన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని తెలియజేయాలి: కేటీఆర్
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:55 PM
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరీ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 23: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరీ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమరభేరీలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
420 హామీలు,13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ‘బాకీ కార్డుల’తో కాంగ్రెస్ హామీలను ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్ళనుంది. గ్రామ గ్రామాన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని తెలియజెప్పాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలేవీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని పార్టీ నేతలకు కేటీఆర్ వివరించారు.
కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం: హరీశ్ రావు
22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే తెలంగాణ అసెంబ్లీని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఆదివారం బోడుప్పల్‌లో 22 A బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలాగే సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రజల ఆస్తులు లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో సర్కారు పెడుతుందని చెప్పారు. భూభారతి పోర్టల్ నుంచి 22A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిని వెంటనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు కూడా చదవండి..
ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు.. కేంద్రం అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో ‘ఛత్రోంకీ గూంజ్’ పెట్టాలి: రాంచందర్‌రావు
For More TG News And Telugu News