Share News

BRS Meeting: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కీలక భేటీ.. చర్చించే అంశాలివే

ABN , Publish Date - Jan 03 , 2026 | 09:16 AM

బీఆర్‌ఎస్ పార్టీ కీలక సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు జరుగనుంది. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.

BRS Meeting: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కీలక భేటీ.. చర్చించే అంశాలివే
BRS Meeting

హైదరాబాద్, జనవరి 3: బీఆర్ఎస్ నేడు (శనివారం) కీలక సమావేశానికి సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వం వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలపై పార్టీ తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.


ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, నేడు కూడా సభకు హాజరుకావద్దని పార్టీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా సభను నడుపుతున్నారని పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.


ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్‌కు సభలో ప్రశ్నలు అడగడానికి, చర్చల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం లేదని పార్టీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిస్థితిపై బీఆర్‌ఎస్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇవ్వనుంది.


ఇవి కూడా చదవండి...

12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌

ప్రధాని, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోల ప్రసారం.. వ్యక్తి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 09:28 AM