బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు: రాంచందర్‌రావు
ABN , Publish Date - Jul 07 , 2026 | 03:02 PM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆ పార్టీ బృందం కలిసింది. SIR విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని రాంచందర్‌రావు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జులై 7: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని(CEO) ఆ పార్టీ బృందం కలిసింది. ఈ సందర్భంగా SIR విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని రాంచందర్ రావు ఫిర్యాదు చేశారు. SIR ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. అనంతరం బీజేపీ తెలంగాణ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో బీఎల్‌వో(BLO)లను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లకుండా బీఎల్‌ఓలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
పలువురు ఓటర్లకు ఫారాలు అందడం లేదని రాంచందర్ రావు తెలిపారు. తెలుగు ఫారాలతో ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హైదరాబాదే కాకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు ఫారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా లోపాలపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు రాంచందర్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య.. 33 పేజీల సూసైడ్ నోట్
కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం
Read Latest Telangana News And Telugu News