Share News

విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యం: అనిత

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:30 PM

నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై ఉన్నతస్థాయి అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని వెల్లడించారు.

విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యం: అనిత
Minister Anitha

అమరావతి, జులై 7: నైరుతి రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈరోజు(మంగళవారం) ఏపీఎస్‌డీఎమ్‌ఏలో(APSDMA) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని హోం మంత్రి ఆదేశించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.


రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్‌నినో ప్రభావం ఉందని హోం మంత్రి తెలిపారు. శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్రస్థాయిలో వర్షాల కొరత ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాభావ ప్రభావం ఉందన్నారు. అలాగే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాభావ ప్రభావం మధ్యస్థంగా ఉందని పేర్కొన్నారు.


కరవు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, విద్యుత్ వంటి కీలక సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదన్నారు. పోలీస్, ఫైర్, NDRF, APSDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని అనిత ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

31 శాఖల్లో పెండింగ్‌ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 02:09 PM