Share News

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:09 PM

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు.

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు
Union Minister Ram Mohan Naidu

విజయనగరం, జులై 7: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు(మంగళవారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తుది మెరుగుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్‌తో కలిసి బ్రహ్మాండమైన ఎయిర్‌పోర్టును నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారని.. అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని అన్నారు. ఆ ఆదేశాలు మేరకు అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు.


ఎయిరో డ్రో లైసెన్స్ కూడా వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభమైన వారం తర్వాత ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత తేదీ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను భోగాపురానికి తరలిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 4 కోట్ల మంది ప్రయాణించే విధంగా టెర్మినల్ నిర్మాణం జరుగుతుందన్నారు. 78,000 చదరపు మీటర్ల మేర టెర్మినల్ బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు.. దేశంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్టు డిజైన్‌గా ఉందని కితాబిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర కళలు, సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైన్ చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం నిలవనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ

31 శాఖల్లో పెండింగ్‌ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 01:17 PM