Share News

ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:17 AM

బంగ్లాదేశ్‌ తరహాలో మన దేశంలో కూడా అరాచకం సృష్టించి ‘పాలన మార్పు’ చేస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి
Ramchander Rao

  • ఎన్నికల్లో గెలవలేక దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిన రాహుల్‌

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌ తరహాలో మన దేశంలో కూడా అరాచకం సృష్టించి ‘పాలన మార్పు’ చేస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ‘ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేకనే రాహుల్‌ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. ఓవైపు రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకొని.. మరోవైపు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రశాంత్‌ భూషణ్‌, సీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటి? గతంలో కశ్మీర్‌ సహా పలు జాతీయ అంశాలపై నిరంతరం దేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ విద్యార్థి విభాగమైన ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు నేహా బోరా, కాక్రోచ్‌ జనతా పార్టీ నేత అభిజీత్‌ దీప్కే తదితరులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ముమ్మాటికీ దేశద్రోహమే’ అని ఆయన స్పష్టం చేశారు.


శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగడం, ప్రజాతీర్పు మేరకు ఒక కూటమి గెలవడం, మరొకటి ఓడిపోవడం నిరంతర ప్రజాస్వామ్య ప్రక్రియ. అయితే బంగ్లాదేశ్‌ తరహా విధ్వంసాన్ని, హింసను ప్రేరణగా తీసుకుని దేశ పాలనలో మార్పు తెస్తామంటూ విద్రోహ శక్తులు ప్రకటించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుందా? దేశ వ్యాప్తంగా ఇలాంటి దేశ వ్యతిరేక నినాదాలు, కుట్రలు జరుగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది?’ అని నిలదీశారు. ‘దేశ ప్రజలకు అత్యంత నమ్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయవ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వంటి సర్వోన్నత సంస్థలను నిర్వీర్యం చేసేందుకు రాహుల్‌ గాంధీ, అర్బన్‌ నక్సలైట్లు పక్కా వ్యూహంతో పనిచేస్తున్నా’రని ఆరోపించారు. వారి పోరాటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌లకు వ్యతిరేకంగా కాదని పేర్కొంటూ, అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యమని రాంచందర్‌రావు మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ వాటాను తోడేస్తున్న కర్ణాటక రైతులు

పండుగ పూట పల్లెలకు నగరవాసులు

రేవంత్‌రెడ్డి ఈఎంఐల ముఖ్యమంత్రి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 06:17 AM