23న కరీంనగర్‌లో బీజేపీ పాదయాత్ర
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:42 AM
రాజ్యాంగ సంస్థలపై ఇండియా కూటమి పక్షాలు ‘సర్’ పేరిట సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సమాయత్తమైంది.
పాల్గొననున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
25న సిద్దిపేట మహా పాదయాత్రలో నడ్డా
వెల్లడించిన ఆ పార్టీ తెలంగాణ శాఖ
హైదరాబాద్, సిద్దిపేట క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సంస్థలపై ఇండియా కూటమి పక్షాలు ‘సర్’ పేరిట సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకత్వాన్ని పాతరేద్దాం’ నినాదంతో కరీంనగర్ వేదికగా నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర శాఖ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం.. నితిన్ నబీన్ ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌కు చేరుకుని వైశ్యాభవన్ నుంచి మహా పాదయాత్రను ప్రారంభిస్తారని పేర్కొంది. కమాన్ వరకు దాదాపు 2 కి.మీ. మేర ఈ పాదయాత్ర సాగుతుందని తెలిపింది. పాదయాత్రలో నితిన్ నబీన్‌తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు రాంచందర్ రావు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ పాల్గొంటారని బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది. సిద్దిపేటలో ఈ నెల 25న తలపెట్టిన మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొంటున్నారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
బీజేపీలో చేరిన పాకాల రాంచందర్
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాకాల రాంచందర్ తన ముఖ్య అనుచరులతో కలిసి హస్తం పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. రాంచందర్‌రావుకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ తీరు నచ్చకే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్లు స్పష్టం చేశారు
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Read Latest Telangana News And Telugu News