ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:30 AM
దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రకటన దేశ పౌరుల విచక్షణను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రకటన దేశ పౌరుల విచక్షణను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. వ్యవస్థలను బలహీనపరచి తద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ, ప్రకాశ్‌రాజ్ లాంటి వారు రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘ప్రధాని పదవి కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికి మాత్రమే సొంతమనే రాచరికపు అహంకారంతో ఉన్న కాం గ్రెస్ పార్టీ, ఒక చాయ్‌వాలా వరసగా మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. వరస ఓటములను తట్టుకోలేక ప్రజాతీర్పును అవమానిస్తోంది’ అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సర్’పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని రాంచందర్‌రావు అన్నారు. ఈ ప్రక్రియను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహిస్తోందన్న విషయాన్ని గుర్తించాలని కాంగ్రె్‌సకు సూచించారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలవాలని కాంగ్రె్‌సకు బీజేపీ ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఓటమిభయంతోనే కాంగ్రెస్ నేతలు ఎన్నిక జరగకుండా పిటిషన్ వేయించారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్
Read Latest AP News And Telugu News