బీజేపీ కార్యకర్తలపై దాడి.. సీఎం స్పందించాల్సిందే: రాంచందర్‌రావు
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:48 PM
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై కక్షపూరితంగానే దాడులు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఈ దాడులపై డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(Telangana BJP Chief Ramachandra Rao) ఈరోజు(మంగళవారం) కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి వినతిపత్రం అందజేశారు రాంచందర్‌రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఓటింగ్ శాతం వచ్చిందని.. దాన్ని జీర్ణించుకోలేక కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోటీ చేయవద్దని హెచ్చరించినా బీజేపీ కార్యకర్తలు పోటీ చేసినందుకు వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
గతంలో నల్గొండలో బీజేపీ కార్యకర్తపై జిల్లా ఎస్పీ చేయి చేసుకున్నారని.. నిన్న(సోమవారం) పరిగి పోలీస్ స్టేషన్‌లో సీఐ మరో కార్యకర్తపై దాడి చేశారని చెప్పారు. హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీజీపీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
అన్నీ అబద్ధపు ప్రచారాలే.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News