Share News

తెలంగాణ అమరవీరుల కలలు కన్న రీతిలో రాష్ట్రం లేదు: బీజేపీ చీఫ్

ABN , Publish Date - Jun 02 , 2026 | 08:06 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, టీజీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హాజరయ్యారు.

తెలంగాణ అమరవీరుల కలలు కన్న రీతిలో రాష్ట్రం లేదు: బీజేపీ చీఫ్
Telangana formation day

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, టీజీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ, అభివృద్ధి పథంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


'చిన్న రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. అమరవీరుల కలలు కన్న రీతిలో ఇంకా రాష్ట్రం వెనుకబడి ఉంది. చిన్నమ్మ సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు అధికారంలో ఉన్నారు. రాష్ట్రా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. జార్ఖండ్ ఏర్పాటు సమయంలో జార్ఖండ్ ఏర్పాటు కానివ్వం అన్నవారే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలన్నది బీజేపీ సంకల్పం' అని నితిన్ నబీన్ అన్నారు.


'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పీఎం కిసాన్ యోజన ,ముద్ర లోన్లు, జన్ ధన్ ఖాతాలు అందించాం. మౌలిక వసతులు,రోడ్లు,రహదారులు,రైల్వేలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వికసిత భారత్ కావాలంటే వికసిత తెలంగాణ కావాలి. ఒక అవినీతి పరుడు చేతుల్లోంచి మరో అవినీతి పరుడి చేతుల్లోకి వెళ్ళింది. తెలంగాణ కలలును సాకారం చేస్తాం' అని నితిన్ నబీన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Updated Date - Jun 02 , 2026 | 08:07 PM