10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:10 PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈనెల 3న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ (DK Shivakumar) ఈనెల 3న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారంనాడు చర్చలు జరిపిన అనంతరం తొలివిడత క్యాబినెట్ కూర్పునకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టు చెబుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే
బెంగళూరులోని లోక్ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 4.05 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డీకే శివకుమార్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసి వారిలో..
1. కేజే జార్జ్
2. జి.పరమేశ్వర
3. రామలింగా రెడ్డి
4. కృష్ణ బైరేగౌడ
5. యూటీ ఖదెర్
6. మల్లనగౌడ బసనగౌడ పాటిల్
7. సతీష్ జార్కిహోళి
8. ప్రియాంక్ ఖర్గే
9. యతీంద్ర సిద్ధరామయ్య
10. లక్ష్మీ బెబ్బాల్కర్‌లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం
టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన