ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్నాం
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:12 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం, వనరుల దుర్వినియోగం జరిగిందని, ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.20 లక్షల కోట్ల మేరకు అప్పుల ఊబిలోకి నెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో వనరుల దుర్వినియోగం: భట్టి
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం, వనరుల దుర్వినియోగం జరిగిందని, ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.20 లక్షల కోట్ల మేరకు అప్పుల ఊబిలోకి నెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ.. ప్రజల సంపదను ప్రజలకే పంచుతోందని చెప్పారు. గతంలో సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే, ప్రస్తుతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు.
గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛలేని జీవితాన్ని అనుభవించారని, వనరులు దోపిడీ.. వ్యవస్థలు దెబ్బతినడం, ఆస్తులు ధ్వంసం కావడం వంటి పరిణామాలను ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ర్టానికి వచ్చే ఆదాయం, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే నిధులను తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్థి కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్