Share News

బెంగళూరు టూ హైదరాబాద్‌ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:33 AM

ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా నిలిచిన డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ అబ్దుల్‌ మిషాల్‌తో పాటు మరో స్మగ్లర్‌ తారీఖ్‌ను ఈగల్‌ ఫోర్స్‌, ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నారు.

బెంగళూరు టూ హైదరాబాద్‌ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌
Bengaluru to Hyderabad drug network

  • ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్స్‌ స్మగ్లర్ల అరెస్టు

  • 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం..

  • రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా నిలిచిన డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ అబ్దుల్‌ మిషాల్‌తో పాటు మరో స్మగ్లర్‌ తారీఖ్‌ను ఈగల్‌ ఫోర్స్‌, ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 50 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలోని మలప్పురం ప్రాంతానికి చెందిన మిషాల్‌, తారీఖ్‌ కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటుపడి పెడ్లర్లుగా మారారు. మిషాల్‌ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్‌ తయారీ, కొనుగోలు, విక్రయాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు ఈగల్‌ అధికారుల విచారణలో వెల్లడైంది.


బెంగళూరుకు చెందిన పప్పీ ద్వారా అతడికి డ్రగ్స్‌ చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పప్పీ పట్టుబడితే నెట్‌వర్క్‌ మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన మిషాల్‌పై అక్కడ ఇప్పటికే రెండు డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయి. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, తెలంగాణ పోలీసులకు పలు కేసుల్లో మిషాల్‌ వాంటెడ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ శివార్లలోని యువత లక్ష్యంగా డ్రగ్స్‌ సరఫరా జరుగుతుందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం సీఐ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 04:33 AM