Share News

Night Kite Festival In Begum Bazar: బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

ABN , Publish Date - Jan 14 , 2026 | 09:01 PM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. అలాగే బేగం బజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది.

Night Kite Festival In Begum Bazar: బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్, జనవరి 14: బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. భవనాలపై నుంచి కైట్లు ఎగరవేస్తూ యువత కేరింతలు కొడుతోంది. ఈ నైట్ కైట్ ఫెస్టివల్‌లో బేగం బజార్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గత వందేళ్లుగా ఈ బేగం బజార్‌ వేదికగా నైట్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇంత ఘన కీర్తి కలిగినఈ ఫెస్టివల్‌లో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అంతా ఉత్సాహాంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి వేళ.. రెండు రోజుల పాటు ఈ ప్రాంత వాసులు ఈ నైట్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.


ఈ ప్రాంతంలో ఆకాశంలో కైట్లు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఈ నైట్ కైట్ ఫెస్టివల్‌ కోసం ఈ ప్రాంతంలోని పలు భారీ భవనాలపై ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ వెలుగుల్లో నైట్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. మరోవైపు బేగంబజారులో డీజేల హోరెత్తుతోంది. ఈ మోతతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నైట్ కైట్ ఫెస్టివల్‌లో ఉత్సాహంగా బేగం బజార్ వాసులు పాల్గొంటున్నారు.


ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరయ్యారు. ఈ దేశంలోని వివిధ నగరాలకు చెందిన దాదాపు 50 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్‌, జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువత సైతం భారీగా ఈ కైట్లు ఎగురవేసే కార్యక్రమానికి హాజరైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..

Read Latest TG News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 09:11 PM