రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడుతారు: ఎమ్మెల్యే తలసాని
ABN , Publish Date - Mar 26 , 2026 | 10:26 AM
బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన సోదాహరణగా వివరించారు.
హైదరాబాద్, మార్చి 26: బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన సోదాహరణగా వివరించారు. గురువారం హైదరాబాద్‌లో అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ఏడాది బీసీ సబ్ ప్లాన్‌కు రూ.800 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రెండో ఏడాది రూ.11 వేల కోట్లు నిధులు కేటాయించి.. కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే టైం వచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతారని జోస్యం చెప్పారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచారని.. ఇది దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.
బీసీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. అలాగే లింగయ్య యాదవ్‌ను రాజ్యసభకు పంపించారని తెలిపారు. చాలా మంది బీసీ నాయకులకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తు చేశారు. కుల వృత్తులను ప్రోత్సహించిన ఘనత సైతం కేసీఆర్‌దేనని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
9 షెడ్యూల్‌లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేశారని కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను బీసీలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టడం ఖాయమని తలసాని శ్రీనివాసయాదవ్ జోస్యం చెప్పారు. గన్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి
ప్రయాణికుల సజీవ దహనంపై దిగ్భ్రాంతి.. రాయవరానికి బయలుదేరిన హోం మంత్రి
For More TG News And Telugu News