Share News

బిగ్ అలర్ట్.. ఈనెల 27న బ్యాంకుల సమ్మె..

ABN , Publish Date - Jan 22 , 2026 | 07:46 PM

దేశవ్యాప్తంగా ఈనెల 27న సమ్మె నిర్వహిస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూదే ఈ సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రకటించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు.

 బిగ్ అలర్ట్.. ఈనెల 27న బ్యాంకుల సమ్మె..
Bank strike January 27

హైదరాబాద్, జనవరి 22: దేశవ్యాప్తంగా ఈనెల 27న సమ్మె(Bank strike January 27) నిర్వహిస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాలుహెచ్చరించాయి. 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రకటించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(జిఐసి) వంటి సంస్థలలో కొనసాగుతున్న విధంగా తమకు 5 రోజులను అమలు చేయాలని గత 15 ఏళ్లుగా పోరాడుతున్నట్లు చెప్పారు. ఇందుకుగాను ప్రతి రోజు 42 నిమిషాలు అధికంగా పనిచేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు అసహనం వ్యక్తం చేశారు.


బ్యాంకింగ్ సెక్టార్(Banking Sector)లో పనిచేస్తున్న వారు సామాజిక జీవితానికి దూరం అవుతున్నందున ఈ విధానాన్ని అమలు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఐదు రోజుల పని దినాలను తప్పనిసరిగా అమలు చేయాలని గత ఏడాది మార్చి 24, 25 తేదీలలో రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచారని ఆంజనేయ ప్రసాద్ గుర్తు చేశారు. 9 నెలలుగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఖాతాదారులు సైతం తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించుకునేందుకు జరుగుతున్న సమ్మెకు మద్దతు పలకాలని ఆంజనేయ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


2024 మార్చిలో వేతన సవరణ సెటిల్‌మెంట్‌ సమయంలో మిగతా రెండు శనివారాలు కూడా సెలవు ఇచ్చేందుకు ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), యూఎఫ్‌బీయూ((UFBU) ) మధ్య అంగీకారం కుదిరింది. తాజాగా ప్రకటించిన ఈ సమ్మె కార్యరూపం దాలిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలపై వరుసగా మూడు రోజుల పాటు ప్రభావం పడనుంది. జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు ఆదివారాలతో పాటు రెండవ, నాలుగో శనివారాలు సెలవు పొందుతున్నారు.


ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 22 , 2026 | 09:12 PM