ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు..
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:44 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు..
హైదరాబాద్, జనవరి 22: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీ 160 కింద నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులను అందజేశారు సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నాయకుల విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. ఆయన్ను కూడా ఇటీవల విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన్ను పలు అంశాలపై విచారించిన అధికారులు.. కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
హరీష్ రావు రియాక్షన్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ‘నిన్న నాకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేదు. రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా.. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా వదలబోము. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా.. రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన వెంటపడుతూనే ఉంటాం’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read:
టీమిండియా అని పిలవకూడదంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే..
ఈశాన్య భారతదేశం.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
జగన్.. నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం: మంత్రి గొట్టిపాటి