Share News

వైభవంగా బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం.. హాజరైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ABN , Publish Date - May 03 , 2026 | 12:38 PM

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ABN ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వైభవంగా బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం..  హాజరైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
Bandla Ganesh Daughter Janani Engagement, attended by ABN Andhrajyothy MD Vemuri Radhakrishna

హైదరాబాద్, మే 3: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఇవాళ (మే 3, 2026) అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకకు చేరుకున్న వేమూరి రాధాకృష్ణకు బండ్ల గణేష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన నిశ్చితార్థం చేసుకుంటున్న జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రాధాకృష్ణకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వేదికపై ఉన్న కొత్త జంటను రాధాకృష్ణ ఆశీర్వదించి, వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.


ఈ నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయనతో పాటు కేశినేని చిన్ని, సినీ దర్శకులు రాఘవేంద్రరావు తదితరులు విచ్చేసి బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తన కుమార్తె వేడుకలో బండ్ల గణేష్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. వచ్చిన అతిథులను స్వయంగా ఆహ్వానిస్తూ వేడుక అంతటా చురుగ్గా పాల్గొన్నారు. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది.


ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 03 , 2026 | 12:58 PM