Share News

50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమేంటి?: బండి సంజయ్‌

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:57 PM

కాంగ్రెస్‌కు 'మనీ'తో తప్ప.. మనుషులతో సంబంధాలు ఉండవని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. విభజన అనేది కాంగ్రెస్‌ DNAలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమేంటి?: బండి సంజయ్‌
Bandi Sanjay On Revanth

హైదరాబాద్‌: లోక్‌సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై నిజాలను చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం అవసరమని అన్నారు. విభజన అనే అంశం కాంగ్రెస్ పార్టీ స్వభావంలోనే ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మనుషులతో కాకుండా డబ్బుతోనే సంబంధాలు ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, మీరు కూడా మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్ మధ్య తేడా ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించారు.


Also Read:

ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం

జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి

For More Latest News

Updated Date - Apr 13 , 2026 | 07:02 PM