జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి
ABN , Publish Date - Apr 13 , 2026 | 03:32 PM
మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్ల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. ఇప్పుడు పురుషుల జీవితాలను దెబ్బతీసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మంచి అలవాట్లు మనల్ని సమాజంలో గౌరవనీయులుగా నిలబెడతాయి. కానీ చెడు అలవాట్లు మన పరువు, గౌరవం మాత్రమే కాకుండా జీవితాన్నే దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పురుషులలో కొన్ని అలవాట్లు ఉంటే, అవి వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ విషయాన్ని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు.
ఆచార్య చాణక్యుడు విజయం, సంపద గురించి మాత్రమే కాకుండా.. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, సమాజంలో గౌరవంగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా వివరించారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, మంచి అలవాట్లు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే, చాలా సార్లు మనకు తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లు మన పురోగతిని అడ్డుకుంటాయి. ఇప్పుడు పురుషుల జీవితాలను దెబ్బతీసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
బద్ధకం
బద్ధకం అనే గుణం విజయానికి అతిపెద్ద అడ్డంకి. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల అవకాశాలు కోల్పోతారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ముందుకు సాగలేరు.
అహంకారం
తన స్థాయి, సంపద, అధికారంపై గర్వపడే వ్యక్తి ఇతరులను చిన్నచూపు చూస్తాడు. అహంకారం పెరిగేకొద్దీ నేర్చుకోవాలనే తపన తగ్గిపోతుంది. అదే అతని పతనానికి కారణమవుతుంది.

బాధపెట్టే మాటలు
కఠినమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. అలాంటి వ్యక్తులు కార్యాలయంలో గౌరవం కోల్పోతారు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కాబట్టి మాట్లాడే మాటలపై నియంత్రణ అవసరం.
చెడు స్నేహాలు
మన స్నేహితులు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేస్తే, అది మన భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి, మంచి ఆలోచనలు ఉన్నవారితో ఉండటం ముఖ్యం.

దుబారా ఖర్చు
ఆదాయానికి మించి ఖర్చు చేయడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. పొదుపు చేయని వారు ఎప్పటికీ స్థిరమైన జీవితం పొందలేరు. కాబట్టి ఖర్చులో జాగ్రత్త అవసరం.
చెడు వ్యసనాలు
మద్యం, ధూమపానం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, జీవితాన్నే నాశనం చేస్తాయి. ఇవి బాధ్యతలను మరచిపోయేలా చేసి, కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. జీవితంలో ఎదగాలంటే ఈ చెడు అలవాట్లను దూరం పెట్టాలని చాణక్యుడు సూచించారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
పక్షుల గుంపులు 'వి' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి.. దీని వెనుక కారణమేంటి?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
For More Latest News