బాల్క సుమన్ కేసులో మరో ట్విస్ట్
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:19 PM
సింగరేణి కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన బాల్క సుమన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ వర్తించదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూన్01: సింగరేణి కార్యాలయంపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన బాల్క సుమన్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ వర్తించదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. బాల్క సుమన్‌పై కేసులో 2 సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. అతడిపై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను నాంపల్లి కోర్టు తొలగించింది. బాల్క సుమన్‌పై నమోదైన కేసు నేపథ్యంలో సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సుమన్ రిమాండ్ రిజక్ట్ కోరుతూ మెమోను దాఖలు చేశారు.
మే 26వ తేదీన తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. నాంపల్లిలోని సింగరేణి భవన్‌తోపాటు మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సింగరేణి భవన్ అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
For More TG News And Telugu News