Share News

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. స్నేహితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:20 AM

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉండి బిటెక్ చదువుతున్న నందిని ఆత్మహత్య చేసుకుంది.

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. స్నేహితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

హైదరాబాద్, మార్చి 19: మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉండి బిటెక్ చదువుతున్న విద్యార్థి నందిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం గమనించిన విద్యార్థులు వెంటనే.. హాస్టల్ యజమానికి తెలియజేశారు. దీంతో హాస్టల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థి నందిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందిని మృతిపై ఆమె స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నారపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నందిని బిటెక్ మూడో సంవత్సరం చదువుతోందని వివరించారు. మృతురాలు నందిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామం అని చెప్పారు. నందిని మృతిపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నందిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు

నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

For More TG News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 10:44 AM