Share News

సినీ దర్శకుడు బి.నర్సింగ్‌రావుకు గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:02 AM

తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకుడు, నటుడు, కవి బి.నర్సింగ్‌రావుకు గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి సత్కరించారు.

సినీ దర్శకుడు బి.నర్సింగ్‌రావుకు గౌరవ డాక్టరేట్‌
B Narsing Rao doctorate

  • గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా ప్రదానం

  • ఘనంగా అంబేడ్కర్‌ వర్సిటీ 27వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకుడు, నటుడు, కవి బి.నర్సింగ్‌రావుకు గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి సత్కరించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్‌ వర్సిటీ) 27వ స్నాతకోత్సవం బుధవారంజూబ్లీహిల్స్‌లోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌శుక్లా ముఖ్య అతిథిగా హాజరై.. విద్యార్థులకు డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు, బుక్‌ప్రైజ్‌లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ అందుకున్న ‘మా భూమి’ దర్శకుడు బి.నర్సింగ్‌రావును గవర్నర్‌ అభినందించారు.


నర్సింగ్‌రావు ఒక విశిష్ట చలనచిత్ర దర్శకుడని కొనియాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సామాజిక వాస్తవాలను జాతీయ, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేశారని ప్రశంసించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, డిజిటల్‌ విద్యపై ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌ యుగంలో.. కొత్త సాంకేతికత మానవ వినాశనానికి కాకుండా సరికొత్త సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు.


స్నాతకోత్సవంలో భాగంగా 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ, ఒకరికి ఎంఫిల్‌ డిగ్రీ ప్రదానం చేశారు. యూజీ, పీజీలో 38 బంగారు పతకాలను విద్యార్థులకు అందజేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చెందిన ఓ ఖైదీ అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకం, బుక్‌ ప్రైజ్‌ అందుకున్నారు. పెద్దపల్లికి చెందిన వట్టిపల్లి పావని (స్కూల్‌ అసిస్టెంట్‌), ఆమె కుమార్తె హైందవిరావు ఒకే వేదికపై పీజీ సర్టిఫికెట్లు అందుకోవడం ప్రత్యేకఆకర్షణగా నిలిచింది. నెల్లూరు జిల్లాకు చెందిన బొజ్జనపల్లి శ్రీఆశ్రిత 3 బంగారు పతకాలతో చరిత్ర సృష్టించింది.


ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మహేశ్‌గౌడ్‌

రేపే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
కుంటి సాకులు చెప్పకండి భట్టీ..!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:03 AM