Share News

ఐపీఎల్ టికెట్ల కోసం సన్ నెట్‌వర్క్ కార్యాలయంపై దాడి

ABN , Publish Date - May 20 , 2026 | 12:13 PM

ఐపీఎల్ టికెట్ల వివాదం హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ల కోసం ఓ వ్యక్తి.. సన్ నెట్‌వర్క్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని బెదిరించడంతో పాటు ఆఫీసుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ టికెట్ల కోసం సన్ నెట్‌వర్క్ కార్యాలయంపై దాడి
IPL Tickets Controversy Sun Network Hyderabad

హైదరాబాద్‌: ఐపీఎల్ టికెట్ల వివాదం హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. ఐపీఎల్ టికెట్ల కోసం సన్ నెట్‌వర్క్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని కురెళ్ల మహేష్ కుమార్ అనే వ్యక్తి బెదిరించిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం, టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతడు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి హంగామా సృష్టించడంతో పాటు దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ ఘటనపై బాధిత సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించనున్నారు.


ఇవి కూడా చదవండి...

టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

సూసైడ్ చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి వ్యక్తి అదృశ్యం..

Read Latest Telangana News

Updated Date - May 20 , 2026 | 12:23 PM