Share News

ఇండి కూటమికి ముస్లింల నాయకత్వం నచ్చదు

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:58 AM

ముస్లింల్లో రాజకీయ చైతన్యం, ముస్లింల నాయకత్వం ఇండియా కూటమికి ఇష్టం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ఒవైసీ అన్నారు.

ఇండి కూటమికి ముస్లింల నాయకత్వం నచ్చదు
Asaduddin Owaisi

  • అందుకే మాతో పొత్తు పెట్టుకోవడం లేదు

  • బీజేపీ బీ-టీమ్‌ ఎవరనే దానిపై అఖిలేశ్‌తో చర్చకు రెడీ

  • రాజ్యాంగాన్ని దెబ్బతీసే వారే మా శత్రువులు: ఒవైసీ

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ముస్లింల్లో రాజకీయ చైతన్యం, ముస్లింల నాయకత్వం ఇండియా కూటమికి ఇష్టం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ఒవైసీ అన్నారు. ముస్లింల నాయకత్వం ఇష్టం లేకనే ఇండియా కూటమి పార్టీలు బిహార్‌లో తమతో పొత్తు పెట్టుకోలేదని, యూపీలోనూ పొత్తుకు నిరాకరిస్తున్నాయని ఆరోపించారు. సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌-2026 పేరిట హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీ-టీమ్‌ ఎవరు? అనే అంశంపై తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే అఖిలేశ్‌ యాదవ్‌ ఆ చర్చకు రావాలని ఒవైసీ సవాలు విసిరారు. ముస్లింలపై జరిగే ఎన్‌కౌంటర్లను అఖిలేశ్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. సమాజ్‌వాదీ పార్టీ సాఫ్ట్‌ హిందూత్వ భావజాలాన్ని అన్వయం చేసుకుందని ఆరోపించారు.


నెహ్రూ కాలంలోనూ యూపీలో ముస్లింలపై దాడులు జరిగాయని, నాలుగేళ్ల కిందట ఓ టోల్‌ ప్లాజా వద్ద తనపై కాల్పులు జరిగాయని ఒవైసీ పేర్కొన్నారు. యూపీలో యోగి హయాంలో 316 మంది ఎన్‌కౌంటర్‌ జరిగితే అందులో 100 మంది ముస్లింలేనని తెలిపారు. ముజఫర్‌ నగర్‌ హింసాకాండ వల్లే తాను యూపీలో అడుగుపెట్టాననన్నారు. 1949లో బాబ్రీ మసీదులో విగ్రహాలు పెట్టినప్పుడు, 1987లో బాబ్రీ తాళాలు తెరిచినప్పుడు, 1992లో మసీదు కూలగొట్టినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? అని ఒవైసీ ప్రశ్నించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ సీఎం అయితే ఎన్‌కౌంటర్లపై కమిషన్‌ వేస్తామని.. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 03:58 AM