అక్టోబరు 4న తూప్రాన్‌కు అమిత్ షా రాక
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:04 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబరు 4న మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో పర్యటించనున్నారు.
తూప్రాన్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబరు 4న మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో పర్యటించనున్నారు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న అమూల్ సంస్థ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేస్తారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
వార్తలు కూడా చదవండి:
మూడేళ్లలో అన్ని రంగాలకూ ఏఐ విస్తరణ
Read Latest AP News And Telangana News And International News And Telugu New