ఏఐసీసీ కార్యదర్శులుగా మరో ఇద్దరు తెలంగాణ నేతలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:04 AM
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నూతన కార్యదర్శుల నియామకం జరిగింది.
అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సంతోష్‌లకు చోటు
ఒడిసా కార్యదర్శిగా కుసుమ్‌కుమార్ కొనసాగింపు
81 మందితో జాబితా విడుదల.. సంపత్‌కుమార్ తొలగింపు
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నూతన కార్యదర్శుల నియామకం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 81 మంది కార్యదర్శులను నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. వీరిలో ఇప్పటికే కార్యదర్శులుగా ఉన్న కొందరికి తిరిగి అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సంతోష్‌లకు కొత్తగా కార్యదర్శులుగా చోటు కల్పించిన అధిష్ఠానం.. ఇప్పటికే కార్యదర్శిగా ఒడిసా బాధ్యతలు చూస్తున్న కుసుమ్కుమార్ను తిరిగి బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అజ్మత్ హుస్సేన్‌ను కర్ణాటక బాధ్యతలు అప్పగించగా.. కోలుకొండ సంతోష్‌ను సందేశ్ ట్రైనింగ్ సెల్ కార్యదర్శిగా నియమించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణకు మరో కార్యదర్శిగా సీమన్ అలెక్స్ సర్న్ను నియమించింది. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షీ నటరాజన్ స్థానంలో ఇటీవలే నియమితుడైన బీఎం సందీ్‌పను ఏఐసీసీ కార్యదర్శుల జాబితా నుంచి తొలగించింది. ఆయనతోపాటు మొత్తం 25 మందిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వీరిలో తెలంగాణకు చెందిన ఎస్ఏ సంపత్‌కుమార్ కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్డీఎమ్ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws