Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:53 AM

అగ్రిగోల్డ్‌ బాధితులకు భారీ ఊరట కలిగించే చర్యలను సీఐడీ అధికారులు చేపట్టారు. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు సంబంధించిన బాండ్‌ పత్రాల వెరిఫికేషన్‌ ప్రక్రియకు షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల

  • 1.65లక్షల మంది బాధితులకు వెరిఫికేషన్‌

  • 10 కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేసిన సీఐడీ

  • 25 నుంచి మండలాల వారీగా వెరిఫికేషన్‌

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : అగ్రిగోల్డ్‌ బాధితులకు భారీ ఊరట కలిగించే చర్యలను సీఐడీ అధికారులు చేపట్టారు. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు సంబంధించిన బాండ్‌ పత్రాల వెరిఫికేషన్‌ ప్రక్రియకు షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్‌ తేదీలు, కేంద్రాలు, వెరిఫికేషన్‌ నిర్వహించే అధికారుల వివరాలను ప్రకటించారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన రూ.447కోట్ల కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను తెలంగాణ సీఐడీ అరెస్టు చేసింది.


రాష్ట్రవ్యాప్తంగా 1.65 మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పది కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మండలాల వారీగా షెడ్యూల్‌ ఉంటుందని, ఇతర వివరాలకు సీఐడీ వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు కోరారు. బాండ్‌ పత్రాలు, ఏజంట్‌ పేరు, నామిని వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులంతా సీఐడీ ఏర్పాటు చేసే కేంద్రాల్లో బాండ్ల వెరిఫికేషన్‌లో పాల్గొనాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పశ్య పద్మ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:53 AM