Share News

ఎలుకలు వైర్లు కొరకడం వల్లే ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:08 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌ అసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి అయిదుగురు నవజాత శిశువులు మరణించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ఎలుకలు వైర్లు కొరకడం వల్లే ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్నిప్రమాదం
Adilabad RIMS

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం..

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ రిమ్స్‌ అసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి అయిదుగురు నవజాత శిశువులు మరణించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎలుకలు వైర్లు కొరకడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. రిమ్స్‌ ఘటనలో మృతిచెందిన నవజాత శిశువుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


దాంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాదాలపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది నల్లపు మణిదీప్‌ సీజేఐకి ఒక నివేదిక పంపించారు. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ చలపతిరావుల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దర్యాప్తు ఏ దశలో ఉందన్న వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేయడానికి పదిరోజుల సమయం ఇస్తున్నామని తెలిపింది.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 06:08 AM