సీఎం రేవంత్ చేతుల మీదుగా షీల్డ్ అందుకున్న ABN ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:57 PM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రతిభను, సేవలను గుర్తిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ABN ఆంధ్రజ్యోతి మీడియాకు చెందిన మహిళా జర్నలిస్టులు ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారు షీల్డ్‌ను అందుకున్నారు.
హైదరాబాద్: ప్రజా భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సత్కరించారు. మీడియా రంగంలో విశేషంగా పనిచేస్తున్న ABN ఆంధ్రజ్యోతి మహిళా జర్నలిస్టులకు కూడా ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు. మహిళా జర్నలిస్టులకు వారు అవార్డులు అందజేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు విజయ చంద్రిక, సుమిత్ర, గోగుమళ్ల కవిత, నందిని బెహరా, లిల్లీ(సమత) అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా షీల్డ్‌లు అందజేసి మహిళా జర్నలిస్టులను అభినందించారు.

తమకు లభించిన గౌరవంపై మహిళా జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని, మీడియా రంగంలో కూడా తమ ప్రతిభను నిరూపిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లభించిన ఈ గౌరవం తమకు మరింత ప్రేరణనిచ్చిందని వారు పేర్కొన్నారు.



Also Read:
భారత్‌లో 4 వేల కోట్ల లీటర్ల చమురు నిల్వలు.. ఎన్ని రోజులకు సరిపోతాయి..
మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్
For More Latest News